: ఫడ్నవీస్ ప్రభుత్వ మనుగడకు పూర్తి మద్దతివ్వలేం: ఎన్సీపీ
శివసేన బెదిరింపుల నేపథ్యంలో ఎట్టకేలకు తమ మద్దతుతో గట్టెక్కిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుకు ఐదేళ్ల పాటు మద్దతు విషయంలో హామీ ఇవ్వలేమని ఎన్సీపీ వెల్లడించింది. దీంతో మరోమారు మహారాష్ట్రలో అయోమయ పరిస్థితి నెలకొంది. ‘ఫడ్నవీస్ ప్రభుత్వ పనితీరుపైనే మా మద్దతు ఆధారపడి ఉంది. మేం అంశాల వారీ మద్దతు మాత్రమే ప్రకటించాం. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకునే చర్యలకే మా మద్దతు ఉంటుంది’ అని మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. సభలో మూజువాణి ఓటుతో ఫడ్నవీస్ సర్కారు విజయం సాధించడంపై అజిత్ పవార్ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో చర్చించిన మీదటే బీజేపీ, మూజువాణి ఓటుకు తీర్మానించడం గమనార్హం.