: జగద్గిరిగుట్టలో సైబరాబాద్ పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్!


హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని నేరస్థులపై పోలీసుల నిఘా మరింత పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు జరగగా, తాజాగా ఆదివారం తెల్లవారుజామున సైబరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్టలోని దాదాపు వెయ్యి ఇళ్లను పోలీసులు చుట్టుముట్టారు. 400 మంది పోలీసులు పాల్గొన్న ఈ ముమ్మర తనిఖీల్లో ఇప్పటికే 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 32 బైకులతో పాటు అక్రమంగా విక్రయానికి పెట్టిన వంద ఎయిర్ సెల్ సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సిమ్ కార్డులు కలిగి ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. సైబరాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో పలు నేరాలకు పాల్పడ్డ నిందితులు పోలీసుల వలకు చిక్కినట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News