: నేడు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నేడు విజయవాడలో జరుగుతున్నాయి. ఎన్నికలు ఏకగ్రీవంగానే ముగిసే అవకాశముందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 20 మంది కార్యవర్గ సభ్యుల నూతన సంఘాన్ని 326 మంది సభ్యులు ఎన్నుకుంటారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులు తొలుత నగరంలోని స్వరాజ్య మైదాన్ నుంచి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టరేట్ కి చేరుకుంటారు. ఎన్నికలు ఏకగ్రీవం కాని పక్షంలో సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ జరగనుంది.