: నేడు పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ పర్యటన!


క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ రమేశ్ టెండూల్కర్ నేడు నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగలో పర్యటించనున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా రాజ్యసభ సభ్యుడి హోదాలో ఈ గ్రామాన్ని సచిన్ ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారమే నెల్లూరు జిల్లా చేరుకున్న సచిన్ కృష్ణపట్నం పోర్టు చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు. నేడు ఆయన పోర్టు నుంచి బయలుదేరి కండ్రిగలో పర్యటించనున్నారు. సచిన్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే, ఈ క్రికెటర్ కోసం కండ్రిగ గ్రామస్థులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మోడల్ గ్రామంగా తమ పల్లెను ఆయన ఎంచుకోవడం పట్ల గ్రామ వాసులు హర్షం ప్రకటించారు. సచిన్ కు ఘన స్వాగతం పలికేందుకు తామంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని గ్రామ మహిళలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News