: చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ ఫైనల్లో హైదరాబాదీలు!


దాదాపు 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ లో భారత బాడ్మింటన్ క్రీడాకారులు టైటిల్ పోరుకు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ తో పాటు మహిళల సింగిల్స్ లోనూ భారత్ తరపున ఫైనల్ బరిలోకి దిగుతున్న ఇద్దరూ హైదరాబాదీలే కావడం గమనార్హం. ఫురుషుల సింగిల్స్ లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ఫైనల్ లో ప్రపంచ మాజీ నంబర్ వన్ లిన్ డాన్ తో తలపడనున్నాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్ లో శ్రీకాంత్ ఆధిక్యంలో కొనసాగుతుండగానే, తన ప్రత్యర్థి, 25వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) గాయం కారణంగా పోటీ నుంచి వైదొలిగాడు. దీంతో శ్రీకాంత్ ను నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచ 16వ ర్యాంక్ లో కొనసాగుతున్న శ్రీకాంత్, తన అభిమాన క్రీడాకారుడు లిన్ డాన్ తో తుది పోరుకు దిగుతుండటంపై ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు మహిళల సింగిల్స్ లో భారత షట్లర్, హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్ కూడా టైటిల్ పోరుకు చేరుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ లో చైనా క్రీడాకారిణిని మట్టికరిపించి ఫైనల్ కు అర్హత సాధించింది. ఆరోసారి ఈ టోర్నీలో పాల్గొంటున్న సైనా ఫైనల్ పోటీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి. ప్రపంచ 35వ ర్యాంకర్ అకెన్ యామగుచి (జపాన్) తో సైనా టైటిల్ పోరులో తలపడనుంది.

  • Loading...

More Telugu News