: రేపే లంకతో టీమిండియా చివరి వన్డే... క్లీన్ స్వీప్ పై ఇండియా కన్ను!


శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో చివరిదైన ఐదో వన్డే రేపు రాంచీలో జరగనుంది. ఐదు వన్డేల ఈ సిరీస్ లో ఇప్పటిదాకా జరిగిన నాలుగు వన్డేల్లోనూ విజయం సాధించిన టీమిండియా 4-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. రేపటి మ్యాచ్ లో సురేష్ రైనా ఆడటం లేదు. అయితే నాలుగో వన్డేలో లంక బౌలర్లకు చుక్కలు చూపించి రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్న రోహిత్ శర్మ ఓపెనర్ గానే బరిలోకి దిగనున్నాడు.

  • Loading...

More Telugu News