: తెలంగాణను విఫల రాష్ట్రంగా చేసేందుకు ఆంధ్రా నేతల కుట్ర: కేసీఆర్


కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా మార్చేందుకు ఆంధ్రా ప్రాంత శక్తులు కుట్రలు చేస్తున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు చేపడుతున్న ఎల్ అండ్ టీ తో శనివారం నాటి సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుందామని భావించానని, అయితే ఆంధ్రా ప్రాంత దుష్టశక్తులు రాష్ట్రాన్ని బతకనివ్వవన్న భావనతోనే పాలన పగ్గాలు చేపట్టానని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకనే మెట్రో రైలు పనులు వేగం పుంజుకున్నాయని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News