: తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణకు గుండెపోటు...స్విమ్స్ లో చేరిక
చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ శనివారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటీన నగరంలోని శ్రీ వెంటకేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో వెంకటరమణకు రెండుసార్లు బైపాస్ సర్జరీలు జరిగాయి. ఇప్పటికిప్పుడు వెంకటరమణ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రమణ, గత ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకుని అనూహ్య రీతిలో తిరుపతి టికెట్ ను దక్కించుకున్నారు. ఎన్నికల్లో ఆయన వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డిపై విజయం సాధించారు.