: అధికారమిస్తే 8 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా: ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హామీ
ప్రజలిచ్చిన అధికారాన్ని కాలరాసి, ఏడాది తిరగకముందే మళ్లీ ఎన్నికలకు కారణమైన ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పార్టీ అధినేత, ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలోని జంతర్ మంతర్ వద్ద ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించి హామీల వరదకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఓట్లేసి అధికారం కట్టబెడితే 8 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాక అన్ని గ్రామాల్లో మెరుగైన క్రీడా వసతులను కల్పిస్తామని కూడా ఆయన ప్రకటించారు.