: అయ్యన్న వైపే చంద్రబాబు మొగ్గు!


విశాఖ జిల్లాల మంత్రుల వివాదంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్ నేత, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి వైపే మొగ్గు చూపారట. విశాఖ జిల్లా ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో అయ్యన్నపాత్రుడు, మరో మంత్రి గంటా శ్రీనివాసరావుల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చాలాకాలం నుంచే ఇరువర్గాల మధ్య విభేదాలున్నా, ఉద్యోగుల బదిలీల విషయంలో వారు సిగపట్లకు సిద్ధమయ్యారు. శుక్రవారం సీఎంఓ అధికారులపై అయ్యన్న చిందుల నేపథ్యంలో వివాదం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో రెవెన్యూ మంత్రి కేఈ కృష్ఱమూర్తి, సీఎంఓ ముఖ్య కార్యదర్శిలను పిలిచి చంద్రబాబు పూర్తి సమాచారాన్ని సేకరించారు. తదనంతరం అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించిన అధికారినే విశాఖ ఆర్డీఓగా బదిలీ చేసేందుకు చంద్రబాబు తీర్మానించినట్లు సమాచారం. అయితే వివాదానికి కారణమైన అయ్యన్నతో పాటు గంటా తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News