: తెలంగాణ మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు!
తెలంగాణలో పది మంది మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు బుల్లెట్ ప్రూఫ్ కార్లను కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే వినియోగిస్తున్నారు. సీఎంలతో పాటు జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన ప్రముఖులకు మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ కార్లకు ప్రభుత్వం అనుమతిస్తూ వస్తోంది. అయితే తాజాగా తెలంగాణ సర్కారు పది మంది మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లను అందించాలని శనివారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో మావోలు బలం పుంజుకుంటున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.