: న్యాయమూర్తుల సంతకాలు ఫోర్జరీ...విశాఖలో ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
ఏకంగా న్యాయమూర్తుల సంతకాలనే ఫోర్జరీ చేసిన ఉదంతం శనివారం విశాఖలో వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖకు చెందిన ముగ్గురు వ్యక్తులు న్యాయమూర్తుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఉద్యోగాల కోసం ఈ ముగ్గురు యువకులను సంప్రదించిన కొందరు వ్యక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఉపేంద్ర, బంగార్రాజు, పవన్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లతో పాటు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నారు.