: నలుదిక్కులను కలుపుతూ హైదరాబాదులో స్కైవేలు: కేసీఆర్


ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హైదరాబాదు నగరంలో మెట్రో రైలు పట్టాలెక్కకముందే, స్కైవేల ఏర్పాటుకు కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. శనివారం మెట్రో రైలుపై సమీక్ష జరిపిన సందర్భంగా కేసీఆర్ ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. సమీక్షలో భాగంగా మెట్రో రైలుపై చర్చ ముగియగానే హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థపై దృష్టి సారించిన కేసీఆర్ స్కైవేల ప్రతిపాదన చేశారు. నగరంలోని నలుదిక్కులను కలుపుతూ స్కైవేలను నిర్మించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని కూడా ఆయన సూచించారు. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలోని రహదారుల విస్తరణపై దృష్టి సారించాలని సూచించిన ఆయన, ఆ తర్వాత హెచ్ఎండీఏ పరిధిలోని రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News