: మోదీ...రాజకీయ రాక్ స్టార్: ద గార్డియన్ పత్రిక
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాధినేతల నుంచే కాక ప్రముఖ పత్రికల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జీ-20 సదస్సు కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మోదీని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద గార్డియన్’ ఆకాశానికెత్తేసింది. ‘రాజకీయ రాక్ స్టార్’గా మోదీని అభివర్ణించిన ఆ పత్రిక, మోదీతో కరచాలనం కోసం పోటీలు పడ్డ ప్రపంచ అగ్ర దేశాధినేతల వైనాన్ని ప్రచురిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. మోదీతో కరచాలనం కోసం ఎగబడ్డ వారిలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారని ఆ పత్రిక పేర్కొంది. సదస్సులో భాగంగా ఒబామాతో పాటు రష్యా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల అధినేతలు పోటీలు పడ్డారని తెలిపింది. తనతో కరచాలనం కోసం వచ్చిన దేశాధినేతలను సాదరంగా స్వాగతించిన మోదీ, వారిని ఆలింగనం చేసుకోవడం అక్కడి మీడియా ప్రతినిధులను ఆకట్టుకుంది.