: కృష్ణపట్నం రేవులో సచిన్ బోటు విహారం!
క్రికెట్ దిగ్గజం, భారత రత్న సచిన్ టెండూల్కర్ శనివారం కృష్ణపట్నం రేవులో బోటు విహారం చేశారు. బోటు నుంచే ఆయన కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలను పరిశీలించారు. హెలికాఫ్టర్ లో కృష్ణపట్నం పోర్టు చేరుకున్న సచిన్, పోర్టు సెక్యూరిటి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోర్టు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత సచిన్ జిల్లా ప్రముఖులను కలవనున్నారు. మోడల్ గ్రామాల పథకంలో భాగంగా సచిన్, నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. కండ్రిగలో సచిన్ రేపు పర్యటించనున్నారు.