: కాశ్మీర్లో మోదీ, బీజేపీ మ్యాజిక్ ఏమీ లేదు: కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాశ్మీర్ లో మోదీ లేదా బీజేపీ మ్యాజిక్ ఏమాత్రం లేదని జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు సైఫ్ ఉద్దిన్ సోజ్ అన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ విజయాల గురించి ప్రస్తావించిన ఆ నేత, కేంద్రంలో బీజేపీ అధికారం పొందడానికి ఆర్.ఎస్.ఎస్ వ్యూహం పనిచేసిందన్నారు. జమ్మూ కాశ్మీర్లో గెలవడానికి బీజేపీ ఎలాంటి కుట్రనైనా పన్నుతుందని ఆయన ఆరోపించారు. కానీ, కాశ్మీర్లో అందరి కుతంత్రాలు విఫలమవుతాయని సైఫ్ ఉద్దిన్ ధీమా వ్యక్తం చేశారు.