: ‘రాజధాని’ సబ్ కమిటీ ముందు రాయపూడి రైతుల ఆందోళన


ఏపీ రాజధాని సబ్ కమిటీ ముందు తుళ్లూరు మండలం రాయపూడి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజధాని కోసం భూములను అప్పగించేది లేదని తేల్చిచెప్పిన రైతులు సబ్ కమిటీ సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమిటీతో పాటు సభకు వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ రైతులతో వాగ్వాదానికి దిగారు. అయినా శాంతించని రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సబ్ కమిటీ తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సబ్ కమిటీ ముందు తమ అభిప్రాయాన్ని చెప్పబోమని కూడా రైతులు భీష్మించారు. నిన్నటిదాకా రైతుల నుంచి ఘన స్వాగతాన్ని అందుకున్న కమిటీ, శనివారం రైతుల నుంచి నిరసనను ఎదుర్కొంది.

  • Loading...

More Telugu News