: చేపలోని టెక్నాలజీతో గాయాలకు చికిత్స


చేపల పేగుల్లో ఒక పరాన్నజీవి సూదుల వంటి నిర్మాణంతో అతుక్కుని ఉంటుంది. దీని ప్రేరణతో గాయాల చికిత్సలో వాడే పట్టీలు శరీరాన్ని బలంగా పట్టుకుని ఉండేలా సూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని రూపొందించే విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూదులు అనగానే మనకు ఆక్యుపంక్చర్‌ గుర్తుకు వస్తుంది. కానీ.. ఇది గుచ్చి చికిత్స చేసే పద్ధతి కాదు.. కేవలం శరీరాన్ని అంటుకుని ఉండడం కోసమే సూదులతోగుచ్చే పద్ధతి. ప్రత్యేకించి కాలిన గాయాల విషయంలో ఈ పట్టీ మూడు రెట్లు అధిక బలంతో ఉంటుందిట. జంతువులపై దీనిని ఇప్పటికీ సమర్థంగా ప్రయోగించి చూశారు కూడా. మామూలు బ్యాండేజీలు చాలా వరకు తడిగా ఉంటే పనిచేయవు. ఈ సమస్య అధిగమించడానికి డాక్టర్‌ జె ఫ్రీ వీటిని రూపొందించారు. ఈ పట్టీల ద్వారా శరీరంలోకి మందులను కూడా పంపవచ్చునట.

  • Loading...

More Telugu News