: పోలీసుల అదుపులో పాక్ చొరబాటుదారు


ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా భారత్ లోకి చొరబడ్డ పాకిస్తాన్ పౌరుడిని బటాలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు సమీపంలోని డేరా బాబా నానక్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ వ్యక్తి బధిరుడని పోలీసులు తెలిపారు. సరిహద్దులో ఫెన్సింగ్ దూకి ఇతను భారత్ లోకి వచ్చి ఉంటాడని భావిస్తున్నట్టు వివరించారు. ఇతను ఎవరైనదీ గుర్తించే పనిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News