: ఈ నెల 18న బీసీసీఐ అత్యవసర సమావేశం


చెన్నైలో ఈ నెల 18న అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బోర్డు ఎన్నికల భవిష్యత్ కార్యాచరణ, వార్షిక సాధారణ సమావేశం గురించి ఈ భేటీలో చర్చించనుంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాం వ్యవహారంలో ముద్గల్ కమిటీ సమర్పించిన నివేదికలో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, బీసీసీఐ సీఓఓ సుందర్ రామన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, మరో ముగ్గురు ఆటగాళ్ల పేర్లు ఉన్నాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో నెల 20న నిర్వహించాల్సిన ఎన్నికలను మరో నాలుగు వారాల వరకు నిలిపివేయాలని బీసీసీఐ భావిస్తోంది. అటు అత్యవసర సమావేశంలో ముద్గల్ కమిటీ నివేదికపైన బోర్డు చర్చిస్తుంది.

  • Loading...

More Telugu News