: ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు: మంత్రి పల్లె రఘునాథరెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు. శనివారం తిరుపతి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని ఐటీ రంగానికి హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ సంస్థలు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. ఇంగ్లండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయన్నారు. పెట్టుబడుల ప్రవాహంలో రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని, భవిష్యత్తులో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యంటూ ఉండదని ఆయన చెప్పారు.