: ఏపీ మంత్రుల ఇళ్ల అద్దె రూ.1 లక్షకు పెంపు!


ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఇళ్ల అద్దె భత్యాన్ని రూ.1 లక్షకు పెంచుతూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఏపీ మంత్రుల ఇళ్ల అద్దె రూ.50 వేలుగా ఉంది. దీనిని రెట్టింపు చేస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సింగపూర్ పర్యటన ముగించుకుని శనివారం హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం అద్దె పెంపు ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News