: కోహ్లీ ప్రపంచలోనే బెస్ట్ ప్లేయర్ అవుతాడు: ఆడమ్ గిల్ క్రిస్ట్ర్


ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించనున్నాడు. ఈ అవకాశంపై ఆ దేశ మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ర్ మాట్లాడుతూ, ఈ చాన్స్ తో తను బాగా బలపడతాడన్నాడు. అంతేకాదు, పెద్ద ఆటగాడు కూడా అవుతాడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సీరిస్ కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడాన్ని కోహ్లీ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ సమయంలో తనకు కొంత అవగాహన అవసరమని సూచించాడు. లెజెండ్ గా నిరూపించుకునేందుకు కోహ్లీ చేయాల్సిందంతా చేయగలడని ఈ మాజీ కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అయ్యేందుకు తనకా సామర్థ్యం ఉందని చెప్పాడు.

  • Loading...

More Telugu News