: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన: ఏపీ మంత్రి పల్లె
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న కేసీఆర్ అసలు సీఎంగా వ్యవహరించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ సర్కారుతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుపై నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న కేసీఆర్ వ్యవహారంపై శనివారం తిరుపతి వచ్చిన సందర్భంగా పల్లె రఘునాథ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిలో కూర్చున్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలన్న పల్లె, ఆ దిశగా కేసీఆర్ వ్యవహరించిన దాఖలా ఇప్పటిదాకా కనిపించలేదన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు తెర తీసిన కేసీఆర్, ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారన్నారు.