: త్వరలో ఏపీ ఆలయాలకు పాలక మండళ్లు: మంత్రి మాణిక్యాలరావు
తిరుమల తిరుపతి దేవస్థానం మినహా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ఆలయాలకు నాలుగైదు రోజుల్లో పాలక మండళ్లను నియమిస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శనివారం ప్రకటించారు. అన్యమత ప్రచారం జరగకుండా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఆలయాల అర్చకులకు ఖజానా ద్వారా వేతనాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఏడాది మధ్యలో దేవాదాయ శాఖ ఉద్యోగులను బదిలీ చేయబోమని ఆయన వెల్లడించారు.