: బహిరంగంగా వ్యక్తి తల నరికిన పాకిస్తానీ మిలిటెంట్లు
సైన్యానికి సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో పాకిస్తాన్ లో ఒక వ్యక్తిని అందరూ చూస్తుండగానే పాకిస్తానీ మిలిటెంట్లు తల నరికి చంపారు. ఖైబర్ జిల్లాలోని మేహర్బాన్ కలయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో బహిరంగ శిక్ష విధించిన మిలిటెంట్లు సాయంత్రం వరకు మృతదేహాన్ని కదిలించవద్దని హుకుం జారీ చేసినట్టు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ ప్రాంతం తెహ్రీక్-ఇ-తాలిబాన్ నియంత్రణలో ఉన్నట్టు ఆ పత్రిక తెలిపింది.