: ఆయన మా 'బంగారు' దత్తాత్రేయ!: కేసీఆర్


కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం బండారు దత్తాత్రేయను బంగారు దత్తాత్రేయగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా చరిత్ర పుటలకెక్కిన బండారు దత్తాత్రేయను తెలంగాణ సర్కారు శనివారం పౌర సన్మానంతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా కేసీఆర్, దత్తన్నను పొగడ్తలతో ముంచెత్తారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ మనిషి లేడన్న కొరతను తీర్చిన దత్తన్న, తెలంగాణకు బంగారు దత్తాత్రేయేనని కొనియాడారు. అలయ్ బలయ్ పేరిట ఏటా పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలను ఒక్కవేదికపైకి చేరుస్తున్న దత్తన్న మరింత ఉన్నత పదవులు అలంకరించాలని కేసీఆర్ అభిలషించారు.

  • Loading...

More Telugu News