: భారతీయ సైనికుడి కుటుంబం కోసం ఆస్ట్రేలియా బ్రిగేడియర్ వినూత్న ప్రదర్శన


25,000 పౌండ్ల కోసం మూడు వారాల్లో 14 వేల పుషప్ లను తీయాలని ఆస్ట్రేలియా సైన్యంలో పనిచేసిన బ్రిగేడియర్ స్థాయి అధికారి బిల్ సౌరి నిర్ణయించాడు. ఓ మిత్రుడి కుమారుని ఆరోగ్యాన్ని బాగు చేయించాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న ప్రదర్శనకు దిగాడు బిల్. పూర్తి వివరాల్లోకి వెళితే... 20 సంవత్సరాల క్రితం ఇండియాలోని స్టాఫ్ కాలేజీలో శిక్షణ ఇచ్చేందుకు వచ్చాడు బిల్. ఆ సమయంలో మరో శిక్షకుడు మొహిత్ విగ్ పరిచయం అయ్యాడు. ఇద్దరి కుటుంబాలు కలసిపోయాయి. కొంతకాలం తరువాత మొహిత్ కు కాశ్మీర్ లో పోస్టింగ్ వేయగా, పాక్ జరిపిన కాల్పుల్లో మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అప్పటికే ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయిన బిల్ కు మొహిత్ మరణవార్త తెలిసినా రాలేకపోయాడు. ఆ పై ఆ కుటుంబంతో బంధమూ తెగింది. ఇటీవల పేస్ బుక్ లో మొహిత్ కుమారుడు జోరావర్ ను గుర్తించాడు బిల్. జోరావర్ తమ్ముడు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకొని బాధపడ్డాడు. అతనిని ఆస్ట్రేలియాకు తీసుకువెళ్ళి చికిత్స చేయించాలని నిర్ణయించాడు. అందుకోసం ఎవరూ చేయలేని పని చేయాలని భావించి 3 వారాల్లో 14 వేల పుషప్ లను తీస్తానని, తనకు విరాళాలు అందించాలని కోరాడు. ఇప్పటికే 10 వేల పౌండ్లు జమ అయ్యాయి. బిల్ ఆశ నెరవేరాలని ఆశిద్దాం.

  • Loading...

More Telugu News