: తగలబడుతున్న షాప్ ను చూసి ఆగిన గుండె!
సంవత్సరాల తరబడి కష్టపడి అభివృద్ధి చేసుకున్న వ్యాపారం మంటల్లో తగలబడి పోతుంటే తట్టుకోలేక ఆగిపోయిందో గుండె. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని తిరువనంతపురంలో నిత్యం బిజీగా ఉండే చాలై మార్కెట్లో ఓ ఫాన్సీ వస్తువులు అమ్మే షాపును షహుల్ హమీద్ (66) నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఫాన్సీ వస్తువులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి, పక్కనే ఉన్న మరో 10 దుకాణాలకు అంటుకున్నాయి. లక్షల రూపాయల విలువైన సరుకు కళ్ళముందే బూడిద కావడాన్ని తట్టుకోలేకపోయిన హమీద్ గుండెపోటు వచ్చి కూలబడ్డాడు. ఆ వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్ళినా అప్పటికే మరణించాడని డాక్టర్లు ప్రకటించారు.