: మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై సల్మాన్ ఖుర్షీద్ పుస్తకం


మన్మోహన్ సింగ్ ప్రధానిగా వ్యవహరించిన ప్రభుత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి, యూపీఏ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పుస్తకం రాస్తున్నారు. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన పలువురు సీనియర్ కార్యనిర్వాహకుల గురించి కూడా పేర్కోనున్నారు. యూపీఏ-2 హయాంలో తన అనుభవం, 2జీ వంటి పలు స్కాంల వల్ల ప్రభుత్వ విశ్వసనీయతపై మచ్చ పడటం వంటి విషయాలను కూడా ఆ పుస్తకంలో ఖుర్షీద్ పొందుపరుస్తారు. అప్పటి యూపీఏ సర్కార్ విధానాలు, నిర్ణయాలపై మన్మోహన్ మాజీ సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం తరువాత వస్తున్న బుక్ ఇది. ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోయే ఈ పుస్తకంపై అంచనాలు పెరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News