: జార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం... నలుగురు అయ్యప్ప భక్తుల మృతి
జార్ఖండ్‌లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో భక్తుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్టు తెలుస్తోంది. గాయపడిన మరొకరి పరిస్థితి సైతం విషమంగా ఉందని సమాచారం. వీరంతా శ్రీకాకుళం జిల్లా రాజాం వాసులు.