: తోకచుక్క నుంచి చివరి మాట!


తోకచుక్కపై 'ఫిలే' జీవితం దాదాపు ముగిసినట్టే. బాటరీల ఛార్జింగ్ అయిపోవటం, సూర్య కాంతిని స్వీకరించే సోలార్ పానల్స్ తెరుచుకోకపోవటంతో 'ఫిలే' తన చివరి మాటలను భూమికి పంపింది. తన మదర్ షిప్ రోసేట్టాతో సైతం సంబంధాలను తెంపుకుంది. "చాలా కష్టపడి అలసి పోయాను. నా శక్తి హరించిపోతోంది" అని చెపుతూ తోకచుక్కపై తాను సేకరించిన సమాచారాన్ని అప్ లోడ్ చేసింది. ఈ సమాచారం సెకనుకు 18 కిలోమీటర్లు ప్రయాణిస్తూ భూమికి వస్తోంది. ఈ సమాచారంతో భూమి ఆవిర్భావం, జీవి పుట్టుక రహస్యాలను తెలుసుకునేందుకు మార్గం సుగమమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఫిలే పనిచేయకపోయినా తోకచుక్క ప్రయాణంలో ఫిలేపై సూర్యకాంతి పడితే దాన్ని తిరిగి పనిచేయించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News