: కేసీఆర్ ముఖ్యమంత్రి అన్న విషయం మరిచిపోయినట్టున్నారు: గంటా


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విషయం మర్చిపోయినట్టున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం విడిగా నిర్వహించడం సరికాదని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు. వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందని, ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇంకా ఉద్యమ నాయకుడిననే అనుకుంటున్నారని, ఎంసెట్ విషయంలో కూడా ఇలాగే మొండిగా వ్యవహరించి రాద్ధాంతం చేశారని ఆయన గుర్తుచేశారు. రాజకీయాలకు విద్యార్థులను బలి చేయవద్దని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News