: మోదీ పిలుపుకు స్పందించిన సోనియా గాంధీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ స్పందించారు. ఉత్తరప్రదేశ్ లో సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గం పరిథిలోని ఉద్వా గ్రామాన్ని ఆమె దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఆమె పూనుకున్నారు. ఆదర్శ సంసద్ గ్రామ్ యోజన పేరిట ప్రతి ఎంపీ మూడు గ్రామాలను దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.