: ఇండోనేసియాకు హెచ్చరిక... సునామీ వచ్చే అవకాశం!


మరో సునామీ ముప్పు ముంచుకొస్తోంది. తూర్పు ఇండోనేసియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. దీని కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని, సముద్రంలోకి వెళ్లకపోవడం మంచిదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఇండోనేసియాలో సంభవించిన భూకంపం కారణంగానే సునామీ సంభవించింది. సముద్రంలో 46 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించిందని, దీని కారణంగా ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్, దక్షిణ ఫసిఫిక్ దీవుల్లో సునామీ సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. భూకంపం కారణంగా ఇండోనేసియాకు 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వస్తుందని వారు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

  • Loading...

More Telugu News