: అమెరికాలో 1,34,292 మంది భారతీయ విద్యార్థులు


విదేశీ విద్య మోజులో విద్య కోసం అమెరికా చేరుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. అక్టోబర్ 7 నాటికి అమెరికాలో చదువుతున్న భారతీయుల సంఖ్య 1,34,292 అని ఆ దేశ నివేదిక వెల్లడించింది. 2013 అక్టోబర్ నాటితో పోలిస్తే 28 శాతం పెరుగుదల వుందని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 9 శాతం పెరిగిందని, అందులో 75 శాతం విద్యార్థులు ఆసియన్లేనని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోని ఇతర ఖండాలతో పోలిస్తే అమెరికాలో చదువుతున్న విద్యార్థులే ఎక్కువమందని ఆ నివేదిక వెల్లడించింది. 73 శాతం మంది భారతీయ విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా విద్యనభ్యసిస్తుండగా, 79 శాతం మంది శాస్త్రసాంకేతిక ఇంజనీరింగ్, గణిత శాస్త్రాల్లో (ఎస్టీఈఎం) చేరుతున్నారని నివేదిక వివరించింది. భారతీయుల తరువాతి స్థానాన్ని చైనీయులు ఆక్రమించారు. 22 శాతం చైనీయులుండగా, 21 శాతం వియత్నాం విద్యార్థులున్నారని నివేదిక తెలిపింది.

  • Loading...

More Telugu News