: ఆదివారం పుట్టంరాజువారి కండ్రిగకు రానున్న సచిన్


రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజు కండ్రిగ (పీఆర్‌ కండ్రిగ) గ్రామాన్ని ఆదివారం సందర్శించనున్నారు. సచిన్‌ గ్రామానికి రానున్న నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేశారు. గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం గ్రామస్థులు మాత్రమే ఆయనను కలవాలని, సందర్శకులు, అభిమానులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. వీఐపీలు క్యూకట్టే అవకాశం ఉందని గమనించిన అధికారులు, వీఐపీలు రావొద్దని సూచించారు. కాగా, సచిన్‌ టెండూల్కర్‌ ఈరోజు ముంబై నుంచి చెన్నైకి విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 5 గంటలకు కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంటారు. అక్కడ కోటి మొక్కల ఉద్యమంలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం 8 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా పీఆర్‌ కండ్రిగకు చేరుకుంటారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ ఊర్లోనే సచిన్‌ గడపనున్నారు. చివరి పది నిమిషాలు గ్రామస్థులతో ఫోటోలు దిగనున్నారు.

  • Loading...

More Telugu News