: 3డీ ప్రింట్ తో రాకెట్ ఇంజిన్ విడిభాగాలు రూపొందించి ప్రయోగించిన నాసా


3డీ ప్రింట్ పరిజ్ఞానంతో రాకెట్ ఇంజిన్ విడిభాగాలు రూపొందించి నాసా విజయవంతంగా పరీక్షించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన ఉష్ణోగ్రత తీవ్రతను తట్టుకునేలా రాగి మిశ్రమంతో 3డీ పరిజ్ఞానంతో రాకెట్ ఇంజిన్ విడిభాగాలు రూపొందించింది. నాసాలోని గ్లెన్ రీసెర్చ్ సెంటర్ లోని ఎయిరో జెట్ రాకెట్ డెయిన్ (ఏఆర్)తో కలిసి నాసా సంయుక్తంగా ఈ రాకెట్ ను పరీక్షించింది. 3డీ పరిజ్ఞానంతో రూపొందించిన విడిభాగాలతో రూపొందిన నాలుగు ఇంజిన్ లపై నాసా 19 రకాల హాట్ ఫైర్ టెస్టులు నిర్వహించి విజయం సాధించింది. 3డీ పరిజ్ఞానంతో రూపొందిన రాకెట్ ఇంజిన్ విడిభాగాలపై అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News