: ఉద్యోగాల పేరిట యువతులను మోసగిస్తున్న చీటర్ అరెస్టు
ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి యువతుల నుంచి నగదు దోచుకుని పారిపోతున్న మోసగాడిని విశాఖలోని గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉండే శ్రీనివాసరావు గత నెల 30న రమ్య అనే యువతికి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఉద్యోగం కోసం కొంత మొత్తం చెల్లించాలని, ఆ నగదు తీసుకుని ఓ ప్రదేశానికి రావాలని చెప్పాడు. అక్కడికి చేరుకున్న అనంతరం ఆమె నుంచి నగదు, నగలు దోచుకుని పరారయ్యాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిపై నిఘా ఉంచిన పోలీసులు, గాజువాకలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇప్పటికే 30 కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.