: ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది: డాలర్ శేషాద్రి


ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని తిరుమల అర్చకుడు డాలర్ శేషాద్రి పేర్కొన్నారు. నిర్దోషిగా చిత్తూరు న్యాయస్థానం నిర్ధారించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 'అంతా గోవిందుడి దయ' అన్నారు. నిర్దోషిగా న్యాయస్థానం నిర్ధారించినందుకు సంతోషంగా ఉందని చెప్పిన ఆయన, టీటీడీలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులకు భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తానని అన్నారు. తాను నేరం చేశానంటే ఎవరూ నమ్మలేదని, చివరకు అదే నిజమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News