: గోవిందరావుపేట గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపీ గరికపాటి
వరంగల్ జిల్లా గోవిందరావుపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ఎంపీ గరికపాటి రామ్మోహనరావు తెలిపారు. గోవిందరావుపేట గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నందమూరి తారకరామారావు ఆశయాల బాటలో పయనించి గ్రామాల సమగ్రాభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సంసద్ గ్రామ ఆదర్శ యోజన పథకం కింద గోవిందరావుపేట పంచాయతీని దత్తత తీసుకుంటున్నానని ఆయన వెల్లడించారు. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు సహకరించాలని ఆయన కోరారు. నిధుల సమీకరణ కోసం కృషి చేస్తానని ఆయన మాటిచ్చారు.