: పరిశోధనా రంగంలో 90 రోజుల్లో మార్పు కనిపిస్తుంది: సుజనా చౌదరి


దేశంలోని సైన్స్ పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి పరంగా రానున్న 90 రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. హైదరాబాదులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ పరిశోధనా కేంద్రాలను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ వైపు చూపుతున్నంత ఆసక్తి సైన్సుపై చూపడం లేదన్న వాదనలో వాస్తవం లేదని అన్నారు. మన దేశంలోని పరిశోధనాలయాలు, వాటిలో ఉన్న ఉద్యోగ అవకాశాలు వారికి అర్థమయ్యేలా వివరిస్తే పరిశోధకుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News