: టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
తెలంగాణ టీడీపీ శాసనసభ్యులు గవర్నర్ నరసింహన్ ను కలసి, టీఆర్ఎస్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, శాసనసభలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. అధికారపక్షం ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతోందని వారు ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీపై పత్రికలలో వచ్చింది నిజమా? కాదా? అని మాత్రమే రేవంత్ రెడ్డి ప్రశ్నించారని, అలా అడగడం తప్పా? అని వారు ప్రశ్నించారు. లక్ష కోట్ల బడ్జెట్ పేరిట కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని వారు విమర్శించారు.