: 'వాఘా' ఆత్మాహుతి బాంబర్ ఫోటో విడుదల చేసిన ఉగ్రవాదులు


ఉన్మాదంతో 61 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న వాఘా ఆత్మాహుతి బాంబర్ ఫోటోను పాక్ తాలిబన్ గ్రూపు విడుదల చేసింది. హనీపుల్లా అలియాస్ హమ్దా (25) అనే యువకుడి ఫోటోను జమాత్ ఉల్ ఆహ్రార్ అనే తాలిబన్ గ్రూపు విడుదల చేసి, వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతికి పాల్పడింది అతడేనని తెలిపింది. సరిహద్దులో ఆరోజు పతకాలు అవనతం చేసిన కాసేపటికి హమ్దా దారుణానికి ఒడిగట్టాడు. దీంతో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు సహా 61 మంది మృతి చెందగా, మరో 110 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News