: బాంబులు, ఏకే 47లతో బెదిరించి...చివరికి 'అంతా ఉత్తినే' అనేశారు!


బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో బాంబులు పేలాయి, ఉగ్రవాదులు ప్రవేశించారు. ఉద్యోగుల్ని భయపెట్టారు. చివరికి అంతా ఉత్తినే అనేసి వెళ్లిపోయారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా, బీబీఎంపీ కార్యాలయం గేటు వద్ద బాంబ్ పేలింది. ఆ పేలుడుకు భూమి దద్దరిల్లింది. అధికారులు, ప్రజల గుండెలదిరాయి. ఈ అనుకోని సంఘటనతో అక్కడి వారు షాక్ తిన్నారు. ఇంతలో పాలికె కౌన్సిల్ సమావేశం భవనం ముందు మరో రెండు బాంబులు పేలాయి. అప్పటివరకు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందిన ఉద్యోగులు ఏదో జరుగుతోందని భయపడి పరుగులంకించుకున్నారు. అంతలోనే కొందరు దుండగులు ముసుగులు ధరించి చేతిలో ఏకే- 47, స్టన్‌గన్‌లతో కార్యాలయంలోకి చొరబడి ఉద్యోగులు, ప్రజలను లొంగిపోవాలని బెదిరించారు. దీంతో వారంతా దుండగులు చెప్పినట్టు చేశారు. ఇంతలో నెమ్మదిగా ఉగ్రవాద నిరోధక దళం పాలికె సర్వసభ్య సమావేశ భవనాన్ని చుట్టుముట్టింది. చాకచక్యంగా లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వారిని క్షేమంగా రక్షించింది. దీంతో ఉద్యోగులు, ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో 'అంతా ఉత్తిదే' అని, ఈ తతంగమంతా మాక్ డ్రిల్ లో భాగంగా జరిగిన ప్రాక్టీస్ అని చెప్పారు.

  • Loading...

More Telugu News