: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని దుండగులు జాతీయ రహదారిపై పట్టపగలు సజీవ దహనం చేశారు. యువతి శరీరం చాలా వరకు కాలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఎవరు? దుండగులు ఎందుకు సజీవదహనం చేశారు? అనే వివరాలు తెలియాల్సిఉంది.