: పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ కు కోర్టు సమన్లు
కెనడియన్ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ కు అర్జెంటినా కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. రెండు నెలల గడువులోగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ అరవై రోజుల సమయంలో కోర్టు ముందుకు వచ్చి తన సాక్ష్యాన్ని ఇవ్వకపోతే అరెస్టు ఎదుర్కోవల్సి ఉంటుందని హెచ్చరించింది. గతేడాది బ్యూనస్ ఎయిర్స్ నైట్ క్లబ్ నుంచి బీబర్ బయటికి వెళుతున్న సమయంలో పోటో తీసేందుకు ఓ ఫోటోగ్రాఫర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో బీబర్, అతని బాడీగార్డ్ ఫోటోగ్రాఫర్ పై దాడి చేశారు. దాంతో, కేసు నమోదై ప్రస్తుతం కోర్టు విచారణకు వచ్చింది.