: తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమం చేశారా అనిపిస్తోంది!: అక్బరుద్దీన్ ఒవైసీ
బడ్జెట్ ను చూస్తుంటే తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమం చేశారా అనిపిస్తోందని ఎంఐఎం శాసనసభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, తాము లేవనెత్తిన ఏ అంశానికీ ఆర్థిక మంత్రి వద్ద సమాధానం లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం కోరితే దానికి సమాధానం లేదని ఆయన మండిపడ్డారు. విద్యుత్ సమస్యలాగే, ఆర్థిక సమస్య కూడా ఉందని, దానిని ఎందుకు దాస్తున్నారని, బహిర్గతం చేయకపోవడానికి కారణాలేంటని ఆయన నిలదీశారు. ప్రభుత్వం కొన్ని అంశాలు ఉద్దేశ పూర్వకంగా దాస్తోందని ఆయన విమర్శించారు. 'టీఆర్ఎస్ మిత్రుడిగా చెబుతున్నా. ప్రతి అంశంపైనా శ్వేత పత్రాలు విడుదల చేయండి' అని ఆయన హితవు పలికారు. శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు.