: రేవంత్ ఇంటి ఎదుట నిరసన అప్రజాస్వామికం: టీడీపీ
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసం ఎదుట తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళన చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ టీడీపీ అభిప్రాయపడింది. ప్రజాసమస్యలపై, అవినీతి అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే వారి ఇంటి ముందు నిరసనలు చేపడ్డం సరైన సంస్కృతి కాదని పార్టీ హితవు పలికింది. ప్రజాసమస్యలు అసెంబ్లీలో లేవనెత్తడం తప్పా? అని ప్రశ్నించింది. ఇలాంటి ఆందోళనలు, నిరసనలకు భయపడేది లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది.