: ఢిల్లీలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉపసంహరణ
దేశ రాజధాని ఢిల్లీలో 7 శాతం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఈ రోజు ఉపసంహరించుకుంది. విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని, శనివారం నుంచి అవి అమల్లోకి రానున్నాయని నిన్న (గురువారం) ప్రకటన చేసింది. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఒక్కసారిగా మండిపడ్డాయి. దాంతో, చరిత్రలో తొలిసారిగా ఛార్జీల పెంపును వెనక్కి తీసుకున్నారు.